న్యాల్‌కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో మానసిక వేదనతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చెల్లా రాజశేఖర్ బుధవారం వెల్లడించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక వేదనకు గురై గ్రామ శివారులోని రైతు సంగమేశ్వర్ వ్యవసాయ పొలంలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు బేగరి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.