ఉరేసుకుని యువకుడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ పోలిస్ స్టేషన్ పరిధిలోని దిడిగి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. దిడిగి గ్రామానికి చెందిన బి.జగదీష్ (25) మహీంద్రా కర్మాగారంలో పర్మనెంటు కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకున్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని కుటుంబీకులకు అప్పగించారు.