ఐఐటీ మద్రాస్‌లో 51వ సారంగ్ సాంస్కృతిక కార్యక్రమాలు నేటి నుంచి 13 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఏడాది 80 వేల మంది వరకు విచ్చేస్తారని ఐఐటీ డైరెక్టర్, ఆచార్యులు వి.కామకోటి బుధవారం పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్న విద్యార్థులు, సమర్పకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.కలారిపాయాట్టు, పారై, ఒయిలాట్టంవంటి పలు రకాల కార్యశాలలు చోటుచేసుకోనున్నాయి.