ముంబైలోని యారీ రోడ్డులో తాజాగా ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ బాలిక పాఠశాలకు వెళుతున్న సమయంలో బాలికపై.. కొందరు యువతుల ముఠా కనికరం లేకుండా దాడి చేశారు. బాలికను దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ.. చిత్రహింసలు పెట్టారు. కొట్టవద్దు అని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.