దంచికొడుతున్న ఎండలు.. ‘రెడ్’ అలర్ట్ జారీ

59చూసినవారు
దంచికొడుతున్న ఎండలు.. ‘రెడ్’ అలర్ట్ జారీ
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లకు వాతావరణ శాఖ ‘రెడ్’ హెచ్చరికను జారీ చేసింది.

ట్యాగ్స్ :