మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హాజరయ్యారు. అధికార వైసీపీ నుంచి నారాయణమూర్తి, పద్మజా రెడ్డి భేటీలో పాల్గొన్నారు. అలాగే సీపీఐ నేత జల్లి విల్సన్, సీపీఎం నేత వై.వి.రావు, కాంగ్రెస్ నేత మస్తాన్ వలి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించనుంది.