నెల రోజులపాటు హైదరాబాద్‌‌లో 144 సెక్షన్

51చూసినవారు
నెల రోజులపాటు హైదరాబాద్‌‌లో 144 సెక్షన్
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు అధికారులు 144 సెక్షన్ విధించారు. ఈ ఆంక్షలు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు అంటే నెల రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్‌‌లో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుమిగూడి ఉండకూడదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్