హాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్స్ 42 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకుంది. అయితే ఈసారి తనను తానే పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘ఇది మీకు తెలివి తక్కువ పనిలా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు నేను చేసినవాటిలో ఇదొక గొప్ప విషయం’ అని భావిస్తున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా, బ్రిట్నీస్పియర్స్ ఇప్పటివరకు ముగ్గురిని వివాహం చేసుకుంది.