ప్రతీ పల్లెకూ ఆత్మనిర్భర భారత్ చేరాలి..మన్ కీ బాత్ లో మోదీ

6698చూసినవారు
ప్రతీ పల్లెకూ ఆత్మనిర్భర భారత్ చేరాలి..మన్ కీ బాత్ లో మోదీ
ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నినదించిన నినాదాలు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్. ఈ మూడు నినాదాలు భారతీయుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ మూడు నినాదాలంటే చైనాకు ఒళ్లు మంట అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ నినాదాలు వచ్చాకే... చైనా వస్తువుల వాడకాన్ని భారతీయులు బాగా తగ్గించేశారని తెలిపారు. నిన్న టాయ్ ఫెయిర్ 2021లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని కోరుతూనే...అదే సమయంలో భారత బొమ్మలు ప్రపంచమంతా విస్తరించాలని కోరారు.

తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ 74వ ఎడిషన్‌లోనూ అదే ఆత్మనిర్భర భారత్ మంత్రాన్ని పఠించారు. పల్లె పల్లెలో ఆత్మ నిర్భర భారత్ నినాదం వినిపించాలని కోరారు. అంతేకాదు అనేక అంశాలను మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఎండాకాలం వస్తున్న సందర్భంగా నీటి ప్రాధాన్యాన్ని వివరించారు. మన జీవితాల్లో నీరు ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేశారు. నీటిని ఆదా చేయడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.

నేడు నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని సర్ సీవీ రామన్ ను గుర్తు చేశారు. ఈ రోజు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారని ప్రధాని అన్నారు. ఆయన చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి వచ్చిందని గుర్తు చేశారు. రామన్ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. అలాగే యూపీలోని లక్నోలో రైతులు సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయం చేస్తుండటాన్ని మోదీ మెచ్చుకున్నారు. పురుగు మందులతో పని లేకుండా చేస్తున్న ఈ వ్యవసాయానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది.

తమిళ సాహిత్యం గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...తాను సీఎం, పీఎం అయినప్పటికీ తమిళ భాష నేర్చుకోలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తమిళనాడులో ఎన్నికలు రాబోతున్న తరుణంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్