రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటుడు కిరణ్ రాజ్‌కు గాయాలు

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటుడు కిరణ్ రాజ్‌కు గాయాలు
కన్నడ సీరియల్ నటుడు కిరణ్ రాజ్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు కెంగేరి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ ఛాతీకి గాయాలయ్యాయి. కిరణ్ రాజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 'కన్నడతి' సీరియల్‌లో హర్ష పాత్రతో ఆయన పాపులర్ అయ్యారు. ఆయన హీరోగా నటించిన రాణి సినిమా గురువారం విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్