కాకినాడ సముద్రతీరంలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడటంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాబేళ్ల మృతిపై ఆరాతీశారు. ఇందుకు గల కారణాలేంటో తెలపాలని అధికారులను విచారణకు ఆదేశించారు. వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన రక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో ఈ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలన్నారు.