మలయాళ నటుడు సిద్ధిఖీ పై నటి రేవతి చేసిన లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తన పై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే స్పందిస్తానని ధృవీకరించారు. నటుడు సిద్ధిఖీ ఆదివారం తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశారు.