హార్దిక్ పాండ్యాపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

1000చూసినవారు
హార్దిక్ పాండ్యాపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమిపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పేలవమైన వ్యూహంతో బరిలోకి దిగాడని తెలిపాడు. ఏడో స్థానంలో హార్దిక్ బ్యాటింగ్ రావడాన్ని తప్పుబట్టాడు. ధోనీలా ఆ స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదని అన్నాడు. ‘గత రెండు సీజన్లలో హార్దిక్ 3, 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కొన్నిసార్లు 5వ స్థానంలో వచ్చాడు. ఇప్పుడు అదే తరహాలో ట్రై చేయాలి. ఏడో స్థానంలో కాదు'' అని షమీ అన్నాడు.