సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు పూల వ్యాపారం చేయడం వల్ల అదే వారి ఇంటి పేరుగా మార్పు చెందింది. జ్యోతిరావు చిన్నతనంలోనే తన తల్లి మరణించింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.