కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ఇది అణచివేత బడ్జెట్‌గా అభివర్ణించారు. సామాన్యులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల గురించి, ఆదాయ అసమానతలను పరిష్కరించడంలోను ఎలాంటి ప్రకటనలు రాలేదన్నారు. ఏంజెల్ ఇన్వెస్టర్లపై పన్నును రద్దు చేసే ఒక నిబంధనను మాత్రమే నేను స్వాగతిస్తున్నానని శశి థరూర్ అన్నారు.