మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య వివాదం ముదరుతోంది. కొండా సురేఖ వర్గం తమను ఇబ్బంది పెడుతోందని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సురేఖపై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా రేపు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీంతో సొంత పార్టీ నేతలే మంత్రిని వ్యతిరేకిస్తుండటం ఆసక్తిగా మారింది.