హిమాచలప్రదేశ్‌లో ఓ వ్యాపారికి ఒకేసారి రూ.210 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. హమీర్‌పూర్ జిల్లాలోని జట్టాన్ గ్రామానికి చెందిన వ్యాపారి లలిత్ ధిమాన్‌కు ప్రతినెలా రూ.3 వేల లోపు కరెంట్ బిల్లు వచ్చేది. తాజాగా అతడికి రూ.210,42,08,405 బిల్లును ఇవ్వడంతో అవాక్కయ్యాడు. దీనిపై విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయగా విద్యుత్తు బిల్లు రికార్డులను పరిశీలించారు. బిల్లు రూ.210 కోట్లు కాదు.. రూ.4,047 అని సవరించటంతో లలిత్ ఊపిరి పీల్చుకున్నారు.