ఢిల్లీలోని కాంచన్ క్లబ్ వద్ద నలుగురు ఆగంతకులు కాల్పులు తెగబడ్డారు. వీరిలో ఇద్దరు క్లబ్‌లోకి చొరబడగా.. మరోవ్యక్తి బయట బౌన్సర్లను గన్‌తో బెదిరించి మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. క్లబ్ ఓనర్ లేకపోవడంతో ఆగంతకులు బయటికి వచ్చారు. తిరిగి వెళ్లేప్పుడు కూడా ఇద్దరు ఆగంతకులు గాల్లోకి కాల్పులు జరిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.