విరాట్ కోహ్లీ తన ఆరాధ్య దైవమని సామ్ కొన్‌స్టాస్ కొనియాడాడు. చిన్నప్పటి నుంచి తనకు విరాట్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. విరాట్ క్రికెట్లో ఒక లెజెండ్ అంటూ ప్రశంసించాడు. అలాగే విరాట్‌ను తన కుటుంబం మొత్తం ప్రేమిస్తుందంటూ వెల్లడించాడు. కోహ్లీతో ఆడడాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీ, కొన్‌స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.