కల్హేర్ మండలం కిష్టాపూర్ మెట్టు కుంట తండా వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పల్లె చెరువు వద్ద జీపు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు దంపతులు స్పాట్లోనే మృతి చెందగా వారి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతులు కామారెడ్డి జిల్లా మల్లూరు తండాకు చెందిన సంగ్య నాయక్ (50) సంఘీభాయ్ (45)గా గుర్తించారు.