Oct 04, 2024, 00:10 IST/అందోల్ నియోజకవర్గం
అందోల్ నియోజకవర్గం
ఆ సీఐ పై సస్పెన్షన్ వేటు
Oct 04, 2024, 00:10 IST
జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన నాగరాజు బదిలీల నేపథ్యంలో వికారాబాద్ టౌన్ సిఐగా బదిలీ అయ్యారు. గతంలో జోగిపేటలో విధులు నిర్వహించిన సమయంలో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు విషయంలో అలసత్వం, దర్యాప్తులో అవకతవకులకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో మల్టీజోన్ 2 ఐజిపి సత్యనారాయణ వికారాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజును గురువారం విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.