IPL-2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో కేకేఆర్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ ఓపెనర్లు నరైన్, డికాక్ ఔట్ అయ్యారు. మొదటి ఓవర్లో బౌల్ట్ వేసిన నాలుగో బంతికి నరైన్ బౌల్డ్ అయ్యారు. రెండో ఓవర్లో దీపక్ చాహర్ వేసిన మొదటి బంతికి డికాక్ క్యాచ్ ఇచ్చి డికాక్ పెవిలియన్ చేరారు. దీంతో 1.1 ఓవర్లకు KKR స్కోర్ 2/2 గా ఉంది.