దౌల్తాబాద్: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ లో 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ముబారస్పూర్, అహ్మద్ నగర్ గ్రామాల్లో నేడు గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందని ఏఈ వాసుదేవరావు తెలిపారు. కావున ఆయా గ్రామాల వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.