తిరుమలాపూర్ లో అంబేద్కర్ 66 వర్ధంతి

84చూసినవారు
తిరుమలాపూర్ లో అంబేద్కర్ 66 వర్ధంతి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో మంగళవారం నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి 66వ వర్ధంతిని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దౌల్తాబాద్ మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిన్న వయసు నుంచి ఎన్నో అవమానాలను భరించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని భారతదేశానికి అందజేశారు. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతది. నేటి సమాజం స్వేచ్ఛ సమానత్వము సౌబ్రాంతుత్వం సోదరా భావం సమ సమాజ స్థాపన కై ఎంతో కృషి చేశారు. సమాజంలో మనిషిని మనిషిగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని వాటిని ఆపే శక్తి యువతకి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ బద్ది రాజు , గణేష్, నవనీత అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు కర్ణాకర్, రుపేందర్, భూపాల్, గౌతమ్ , కరుణాకర్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్