సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పలు గ్రామాలలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మా తండ్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్పా దుబ్బాక ఏమి అభివృద్ధి జరగలేదన్నారు. అందుకే నాకు ఒకసారి దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి అంటూ.. చేతి గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస రెడ్డి అనే నన్ను గెలిపిస్తే దుబ్బాక ను అభివృద్ధి లోకి తీసుకెళ్తానని అన్నారు. అంతేకాకుండా దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.