మానవత్వాన్ని చాటుకున్న జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్

267చూసినవారు
మానవత్వాన్ని చాటుకున్న జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్
తల్లిదండ్రులను కోల్పోయి చదువుకు దూరమైన మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన సౌందర్య పరిస్థితిపై పత్రికలో వచ్చిన కథనంపై రణం శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. 5, 000 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లిదండ్రులను కోల్పోతే మానసిక క్షోభ ఎలా ఉంటుందో తాను అనుభవించానని, సౌందర్య ఉన్నత చదువులకు సాయం అందించడంతో పాటు ప్రస్తుతం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సౌందర్య పరిస్థితిని పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివి మంచి స్థితిలో స్థిరపడి తల్లిదండ్రుల కలను నిజం చేయాలని ఈ సందర్భంగా వారు సౌందర్యకు సూచించారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు.

గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామస్తులు జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకు రాగా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. జెడ్పిటిసి నిధుల నుండి వైకుంఠధామంలో బోరు మోటర్ అందిస్తామని పేర్కొన్నారు. జడ్పీ నిధులతో గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణం త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా నిర్మాణం ప్రారంభం కాని గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పంచాయతీ భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని పల్లెలు పచ్చని వనాలకు నిలయాలుగా మారుతున్నాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు శివకుమార్, సుగుణ యాదగిరి, ఉపసర్పంచ్ ప్రభాకర్, నాయకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :