వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సతీ సమేతంగా కలిసి దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సుభిక్షంగా ఉండాలని వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ స్వామివారు ప్రసాదించాలని వేడుకున్నారని తెలిపారు.