రహదారిపై ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, విభాగినిని దాటి, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనగా, ఘటనా స్థలంలోనే కానిస్టేబుల్ దుర్మరణం పాలైన ఘటన చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రామక్కపేటకు చెందిన పెంబర్తి నవీన్ (38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.