
నూతన ఎమ్మార్వో ని కలిసిన బేగంపేట వాసులు
అక్బర్ పేట భూంపల్లి మండల నూతన తహశీల్దార్ మల్లికార్జున్ రెడ్డి ని సోమవారం బేగంపేట గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. గ్రామంలో ఉన్న రెవిన్యూ సమస్యలపై తహశీల్దార్ కి వివరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.