దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట భూంపల్లి మండలాన్ని పూర్తిస్థాయి మండలంగా ఏర్పడడానికి కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి శనివారం హైదరాబాద్ కొంపల్లిలోని వారి నివాసంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి, బేగంపేట తాజా మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.