గుండెపోటుతో రైతు మృతి

82చూసినవారు
గుండెపోటుతో రైతు మృతి
గుండెపోటుతో రైతు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గొల్ల రామకృష్ణ అనే రైతు ప్రతిరోజు మాదిరిగానే తన వ్యవసాయ క్షేత్రంలో పొద్దంతా వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిలో నిద్రపోయాడు. ఆదివారం నిద్రపోయిన వ్యక్తి లేవకపోవడంతో భార్య సత్తవ్వ నిద్రలేపగా రామకృష్ణ నిద్ర లేవకపోవడంతో భార్య కుటుంబ సభ్యులు బోరుణ వినిపించారు.

సంబంధిత పోస్ట్