సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని మజీద్ లో శనివారం దుబ్బాక నియోజకవర్గ స్థాయి ముస్లిం సోదరులు సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం స్థాయిలో మజీద్ కమిటీని రెండు సంవత్సరాల కాల పరిమితిగా నూతన కార్యవర్గాన్ని 8 మండలాల అధ్యక్షుల సమక్షంలో నూతన అధ్యక్షులుగా మహమ్మద్ మౌలానోద్దీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా యూసుప్, షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు.