సిద్దిపేట: ఆహారం విషయంలో మరింత నాణ్యత పాటించాల్సిందే

55చూసినవారు
ఆహారం విషయంలో మరింత నాణ్యత పాటించాల్సిందేనని దుబ్బాక ఎమ్మార్వో ఎంపీడీవోలు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను దుబ్బాక ఎమ్మార్వో, ఎంపీడీవో, మెడికల్ ఆఫీసర్ లు కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీ చేశామన్నారు. భోజనం మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలని పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు.