Oct 20, 2024, 02:10 IST/
టెంపోను ఢీకొన్న ట్రావెల్ బస్సు.. 11 మంది మృతి
Oct 20, 2024, 02:10 IST
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థోల్పుర్లో శనివారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. అయితే, వీరంతా బరౌలీలో ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.