Feb 10, 2025, 05:02 IST/
ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు?
Feb 10, 2025, 05:02 IST
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్- బీజేపీ దోస్తీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్- బీజేపీ ఇద్దరూ ఒకటేనని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.