సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి వ్యవస్థాపకులు భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వినూత్నంగా 220 నాణాలతో దీపావళి దివ్య జ్యోతిని ఆకర్షణీయంగా రూపొందించారు. నాలుగు దశాబ్దాల క్రితం చలామణిలో ఉన్న అరుదైన 20 పైసల నాణాలతో 5 అడుగుల ఎత్తులో జ్యోతిని తయారుచేసి మంగళవారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతి ఇంట చీకటి వైదొలికి, దీపావళి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.