మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం అక్కారం రైతు రామాగౌడ్ కు చెందిన వ్యవసాయ పొలం వద్ద ఫామ్ పౌండును ఆయన ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబానికి కనీసం వంద రోజుల ఉపాధిని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.