సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ కోరారు. ఆదివారం హుస్నాబాద్ లో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. సూపర్వైజర్లు ప్రతి రోజూ పర్యవేక్షించాలన్నారు. అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ విపణి, కోహెడ మండలం బస్వాపూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.