సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మొదట పట్టణంలోని స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారనీ, అనంతరం ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.