మద్యం షాపులకు తొలి రోజు 200 దరఖాస్తులు
ఏపీలో కొత్త మద్యం షాపుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. తొలి రోజైన మంగళవారం 200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆఫ్లైన్ విధానంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా దరఖాస్తులు సమర్పించినవే ఎక్కువగా ఉన్నాయి. నిన్న అమావాస్య కావడంతో వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.