ఆర్థిక ఇబ్బందులతో దంపతులు సూసైడ్
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన శేఖర్(31), సౌమ్య మణి(28) దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.