సంగారెడ్డి లోని జూబ్లీ క్లబ్ లో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టు ఎంపిక ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి శనివారం తెలిపారు. 1-9-2005 నుంచి 31-8-2008 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల బోనాఫైడ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని చెప్పారు.