జనవరి 2న స్వర్ణోత్సవాలు
ఇంటర్ విద్య ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపాల్ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో 2వ తేదీన స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు ఇంటర్ విద్య కమిషనర్ పాల్గొనున్నారు.