చెన్నై మీదుగా కంబోడియాకు వెళ్తున్న సిమ్‌లు

85చూసినవారు
చెన్నై మీదుగా కంబోడియాకు వెళ్తున్న సిమ్‌లు
హైదరాబాద్‌ పోలీసులు ఇటీవల ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను విదేశాలకు అక్రమంగా చేరవేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసింది. కంబోడియాలో ఉంటున్న రాజేశ్‌ సారథ్యంలో అక్రమాల దందా సాగిస్తున్నట్టు దర్యాప్తులో నిర్ధారించారు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకూ 2,500 సిమ్‌కార్డులు చెన్నై ద్వారా కంబోడియా తరలించినట్లు గుర్తించారు. సిమ్‌కార్డుల విక్రయ దుకాణదారులు భారీఎత్తున నకిలీ చిరునామా, ఇతరుల పేరిట అడ్డదారిలో ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.