తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించే ప్రముఖ సింగర్ సునీత తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సింగర్ నిత్యం తన ఫోటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకున్నప్పటినుంచి నెట్టింట పలు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఆమె 45 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతుంది అంటూ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.