జ్ఞానమే ఆడపిల్లలకు నిజమైన ఆభరణం అని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. మల్యాల మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెచ్ఎం నీరజ అధ్యక్షతన మహిళల రక్షణ-మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.