ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలోని మామిడిపల్లె మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. కాపు సంఘం అధ్యక్షులుగా మామిడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మేడిపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కుంటూరి ప్రతాప్, కోశాధికారిగా మామిడి చందు, సహాయ కార్యదర్శిగా మామిడి సంజీవ్ తో పాటు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీకి కాపు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.