పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బైరి రాజయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మాదారపు కరుణాకర్ రావు, మాజీ సర్పంచ్ తాటి పామరాజు, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు భోగ లక్ష్మీనారాయణ, పాక్స్ డైరెక్టర్ గండ్ర ప్రవీణ్ రావు, ఉప సర్పంచ్ విద్యాసాగర్ రావు, మరియు టిఆర్ఎస్ నాయకులు తోడేరీ లోకేష్, బత్తుల ప్రదీప్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.