ఆ నక్షత్రాల మధ్య వేగుచుక్క పొడవగానే అక్కడి కనుమల్లో సందడి మొదలవుతుంది. గుడారాల నుంచి టార్చ్‌లైట్లతో ఒక్కొక్కరిగా బయటకొస్తారు. అప్పటిదాకా చలికి క్యాంప్ ఫైర్ వేసుకున్న వారు కాస్త ఆకాశం వైపు చూడటం మొదలు పెడతారు. భానుడు రాకతో మేఘాలు పాలసముద్రంలా కనిపిస్తాయి. చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. భానుడి వేడికి మబ్బులు వీడి చక్కటి పచ్చదనం పరుచుకుంటుంది. దాన్ని తనివితీరా ఆస్వాదించేందుకు సందర్శకులు తరలివస్తారు.