భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య

83చూసినవారు
భవనం పైనుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
TG: పెళ్లైన 4నెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. HYD భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన శబరీష్‌ యాదవ్‌తో వివాహం జరిగింది. సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తూ.. అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. బుధవారం సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ వెల్లగొట్టారు. దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత పోస్ట్